sensex: ఒడిదొడుకుల మధ్య ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు
  • ఆచితూచి అడుగు వేసిన ఇన్వెస్టర్లు
  • 26 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

ఈరోజు ఆద్యంతం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల్లో కొట్టుమిట్టాడాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగువేశారు. చివరకు మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 26 పాయింట్ల స్వల్ప లాభంతో 36,266 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 10,948 వద్ద స్థిర పడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ పవర్ (17.58%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (8.59%), ఐడీబీఐ బ్యాంక్ (7.14%), రతన్ ఇండియా పవర్ (6.45%), ఇండియాబుల్స్ రియలెస్టేట్ (5.83%).
 
టాప్ లూజర్స్:
రామ్కో సిమెంట్స్ (-5.09%), స్టెరిలైట్ టెక్నాలజీస్ (-5.03%), బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.82%), యూపీఎల్ లిమిటెడ్ (-4.81%), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (-4.74%).     

  • Loading...

More Telugu News