polavaram: పోలవరానికి ఖర్చు చేసిన నిధులు విడుదల చేయండి: నితిన్‌ గడ్కరీతో చంద్రబాబు

  • పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి సాయం చేయాలి
  • ఫిబ్రవరి నాటికి కాంక్రీటు పనులు పూర్తవుతాయి
  • అంచాల ప్రకారం పోలవరానికి రూ.57,940 కోట్లు అవసరం
  • భూసేకరణకే రూ.33 వేల కోట్లు

పోలవరానికి ఖర్చు చేసిన రూ.2,200 కోట్ల బకాయిలను కేంద్ర సర్కారు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి చంద్రబాబు పోలవరం పనులను పరిశీలించిన విషయం తెలిసిందే. అనంతరం ఇరువురూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఫిబ్రవరి నాటికి కాంక్రీటు పనులు పూర్తవుతాయని, సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ.57,940 కోట్లు అవుతుందని చంద్రబాబు అన్నారు. ఇందులో భూసేకరణకే రూ.33 వేల కోట్లు అవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2019 డిసెంబరు వరకు డెడ్‌లైన్‌ పెట్టుకున్నామని అన్నారు. మీడియా సమావేశం అనంతరం పోలవరం అతిథి గృహంలో నితిన్‌ గడ్కరీతో చంద్రబాబు సమావేశమయ్యారు. 

  • Loading...

More Telugu News