BJP: బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ మరో ఛార్జిషీటు
- ఉన్నావో సామూహిక అత్యాచారం కేసు
- ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
- తన స్నేహితులతో కలిసి పలుసార్లు అత్యాచారం
ఉన్నావో సామూహిక అత్యాచారం కేసులో బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 363 (అపహరణ), 376 (అత్యాచారం) కేసులతో పాటు పలు సెక్షన్ల కింద ఆయనపై విచారణ కొనసాగనుంది. ఈ కేసును తమకు అప్పగించిన వెంటనే సీబీఐ మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్లను నమోదు చేసి విచారణ జరుపుతోంది.
ఓ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇంటికి తీసుకెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్.. తన స్నేహితులతో కలిసి ఆమెపై పలుసార్లు అత్యాచారం జరిపారని ఇప్పటికే నిర్ధారణ అయింది. తొలుత సదరు ఎమ్మెల్యేను ఈ అత్యాచార కేసు నుంచి కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారని కూడా తేలింది.