Yadadri Bhuvanagiri District: ప్రియుడు మోసం చేయడంతో సెల్ టవర్ ఎక్కిన యువతి.. దూకేస్తానని బెదిరింపు
- యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో ఘటన
- ప్రియుడి ఇంటి ముందు మూడు రోజుల ధర్నా
- ఫలితం లేకపోవడంతో సెల్‌టవర్ వద్దకు యువతి
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో సెల్‌టవర్ ఎక్కిన ఓ యువతి అక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తోంది. తనను ఓ అబ్బాయి ప్రేమించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది. వలిగొండ మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్ అనే యువకుడు ఇన్నాళ్లు తనతో తిరిగి పెళ్లి పేరు ఎత్తేసరికి తనను కలవద్దంటున్నాడని తెలిపింది. ఆ యువకుడి ఇంటి ముందు మూడు రోజులుగా ధర్నా చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని వాపోయింది. వెంకటేశ్వర థియేటర్ పక్కన ఉన్న ఆ సెల్ టవర్‌పై ఉన్న ఆమెను దిగి రావాలని స్థానికులు కోరుతున్నారు.