Andhra Pradesh: ప్రకాశం జిల్లాలోని వాడరేవు పోర్టుకు 3 వేల ఎకరాలు కావాలని చంద్రబాబుకి లేఖ రాస్తాను: నితిన్‌ గడ్కరీ

  • విశాఖలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మీడియా సమావేశం
  • వాడరేవు పోర్టుని అభివృద్ధి చేస్తాం
  • అన్ని పోర్టులకు కంటైనర్ స్కానర్లను అందుబాటులో తెస్తాం
  • రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

విశాఖపట్నం పోర్టు విస్తరణకు ఎటువంటి భూమీ అదనంగా లభించే అవకాశం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తాము ప్రకాశం జిల్లాలోని వాడరేవు పోర్టుని అభివృద్ధి చేస్తామని, పోర్టులు ఉన్న చోట క్రూజ్‌ టెర్మినళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాడరేవు పోర్టుకు 3 వేల ఎకరాలు కావాలని సీఎంకు లేఖ రాస్తానని అన్నారు.

అన్ని పోర్టులకు కంటైనర్ స్కానర్లను అందుబాటులో తెస్తామని అన్నారు. వాడరేవు పోర్టుకు సమస్యలు లేకుండా చూస్తామని రాష్ట్ర సర్కారు చెప్పిందని, 3 వేల ఎకరాలు ఇస్తే ఏపీలో పోర్టు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంపై ప్రతిపాదనలు పంపామని అన్నారు. అలాగే, కృష్ణానదిలో క్రూజ్‌ టెర్మనల్‌ కూడా ఏర్పాటవుతుందని చెప్పారు. 

  • Loading...

More Telugu News