Vijayawada: విజయవాడ కనకదుర్గ ఆలయంలో పరిపూర్ణానంద ప్రత్యేక పూజలు
- కనకదుర్గమ్మను దర్శించుకుని మీడియాతో మాట్లాడిన స్వామీజీ
- హిందూ సంప్రదాయం, విలువల గురించి తెలపాలి
- విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి
- మన సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది
హిందువులను రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారని పేర్కొంటూ శ్రీ పీఠం అధిపతి, రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి పరిపూర్ణానందను ఇటీవల పోలీసులు హైదరాబాద్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయన.. ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పరిపూర్ణానంద మీడియాతో మాట్లాడుతూ.... హిందూ సంప్రదాయం, విలువల గురించి తెలియజేసేలా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని, మన సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని అన్నారు. చట్టాలు కఠినంగా ఉన్నప్పుడే మతం, సంస్కృతులపై దాడులు జరగవని అన్నారు.