Rajasthan: రాజస్థాన్ ఎడారి ఒకప్పుడు సముద్రం కింద ఉండేదట!
- ఆ శిలాజాలు 4.7 కోట్ల క్రితం నాటివి
- ప్రీ-హిస్టారిక్ యుగానికి చెందినవి
- ఈ ప్రాంతంలో ఒకప్పుడు సముద్రం ఉండేది
రాజస్థాన్ లో ఉన్న ఎడారి ఒకప్పుడు సముద్రం కింద ఉండేదంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. జైసల్మేర్ జిల్లాలో దొరికిన శిలాజాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యకర వివరాలను వెల్లడించారు. ఈ శిలాజాలు 4.7 కోట్ల ఏళ్ల క్రితానికి చెందినవని తెలిపారు. వేల్, షార్క్ దంతాలు, మొసలి దంతాలు, తాబేలు ఎముకలకు సంబంధించిన శిలాజాలను పరీక్షించిన శాస్త్రవేత్తలు ఇవి ప్రీ-హిస్టారిక్ యుగానికి చెందినవని... ఆ సమయంలో ఈ ప్రాంతమంతా సముద్రం కింద ఉండేదని తెలిపారు.
జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పశ్చిమ విభాగం... గుజరాత్, రాజస్థాన్ లలో లభించిన శిలాజాలపై ఏడాదికిపైగా రీసర్చ్ చేస్తోంది. ఈ క్రమంలో జైసల్మేర్ జిల్లా బంధా గ్రామంలో లభించిన వేల్, షార్క్, మొసలి దంతాలు, తాబేలు దంతాలపై వారు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఒకప్పుడు సముద్రం ఉండేదని చెప్పారు.