Afghanisthan: వందమంది ఉగ్రవాదులను లేపేసిన ఆఫ్ఘనిస్థాన్

  • ఉగ్రవాదులపై ఉక్కుపాదం
  • ఒక్క రోజే వందమంది ఏరివేత
  • ప్రకటించిన భద్రతా దళాలు
ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఒక్క రోజులోనే ఏకంగా వందమందిని ఏరిపారేసింది. ఈ విషయాన్ని దేశ భద్రతా దళాలు ప్రకటించాయి. తాము నిర్వహించిన ఆపరేషన్‌లో వందమంది హతమైనట్టు పేర్కొన్నాయి. ఫక్తియా ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో వీరంతా హతమయ్యారని, వారిలో పలువురు తాలిబన్ కమాండర్లు కూడా ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు భద్రతా దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో పదుల సంఖ్యలో తీవ్రవాదులు హతమైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Afghanisthan
Terrorists
Security forces

More Telugu News