Godavari: తాలిపేరుకు మరింత వరద... ఉప్పొంగుతున్న గోదారమ్మ!

  • 72 మీటర్లు దాటిన తాలిపేరు నీటిమట్టం
  • భద్రాచలం వద్ద 33 అడుగులకు పెరిగిన గోదావరి
  • గంటగంటకూ పెరుగుతున్న వరద

ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలో వరద ప్రవాహం మరింతగా పెరుగుతోంది. తాలిపేరు ప్రాజెక్టుకు వరద పెరుగగా నీటిమట్టం 72.31 మీటర్లకు చేరడంతో, గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 4,380 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 4,196 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి మరో మూడు అడుగులు పెరిగింది. నిన్న 29 అడుగులు దాటి ఉన్న నీటి మట్టం ఈ ఉదయం 33 అడుగులకు దగ్గరైంది.

గోదావరి నదిలో గంటగంటకూ వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో, నిన్న ఐ పోలవరం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన చిన్నారుల వెలికితీత కష్టంగా మారింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యానాం వద్ద నది సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి ఎగువకు ఈ తెల్లవారుజాము నుంచి గాలిస్తున్నా, గల్లంతైన ఆరుగురిలో ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News