anna canteens: అన్న క్యాంటీన్లలో అల్పాహారం, భోజనాల మెనూ ఇదే!
- అన్న క్యాంటీన్ల మెనూ విడుదల
- నేటి నుంచి అమల్లోకి
- పసందైన వంటకాలను అందిస్తున్న క్యాంటీన్
ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున 'అన్న క్యాంటీన్'లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్యాంటీన్ల ద్వారా అందించే అల్పాహారం, భోజన పట్టికను ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ మెనూ అమల్లోకి వస్తుంది.
అల్పాహారంలో భాగంగా ప్రతి రోజు ఇడ్లీ, పొడి, సాంబారు కచ్చితంగా ఉంటుంది. దీనికి తోడు సోమవారం పూరి, కుర్మా వుంటాయి. మంగళవారం ఉప్మా, బుధవారం పొంగల్, గురువారం పూరి, శుక్రవారం ఉప్మా, శనివారం పొంగల్ వుంటాయి. అల్పాహారం ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు లభిస్తుంది. ఇడ్లీ, పూరి మూడు చొప్పున ఇస్తారు. ఉప్మా, పొంగలి 250 గ్రాములు పంపిణీ చేస్తారు.
భోజనం మాత్రం వారం రోజులూ ఒకేలా ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అందించే భోజనంలో రైస్, కూర, పప్పు, సాంబారు వుంటాయి. పెరుగు, పచ్చడిని పంపిణీ చేస్తారు. వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ వడ్డిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు... రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్కరికి 400 గ్రాముల అన్నం అందిస్తారు. ఆదివారం 'అన్న క్యాంటీన్ల'కు సెలవును ప్రకటించారు.