gold: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 తగ్గింది
- అదే బాటలో వెండి ధరలు
- అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పెరిగిన ధరలు
నేటి బులియన్ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 తగ్గి రూ.31,050కి చేరింది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.130 తగ్గి రూ.39,820కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.31,050 కాగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.30,900.
స్థానిక నగల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర తగ్గగా, పారిశ్రామిక వర్గాల నుంచి, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తక్కువగా ఉండటంతో వెండి ధర కూడా తగ్గినట్టు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.28 శాతం పెరిగి 1243.70 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి ధర 0.44 శాతం పెరిగి 15.38 డాలర్లుగా ఉంది.