stock market: స్టాక్ మార్కెట్లకు అవిశ్వాస తీర్మానం దెబ్బ
- అవిశ్వాసంపై చర్చ చేపడతామన్న ప్రకటనతో కుప్పకూలిన మార్కెట్లు
- 147 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 11 వేల దిగువకు పడిపోయిన నిఫ్టీ
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. ఉదయం నుంచి పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వచ్చిన మార్కెట్లు... అవిశ్వాసంపై చర్చ జరుపుతామంటూ స్పీకర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే కుప్పకూలాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయంట్లు పతనమై 36,373కు పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 10,980కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఫ్యూచర్ కన్జ్యూమర్ లిమిటెడ్ (7.12%), ఇన్ఫో ఎడ్జ్ (5.90%), ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (5.00%), రాడికో ఖైతాన్ లిమిటెడ్ (4.99%), ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (4.09%).
టాప్ లూజర్స్:
అశోక్ లేల్యాండ్ (-13.93%), హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ (-6.44%), జిందాల్ స్టీల్ అండ్ పవర్ (-6.33%), పీసీ జువెలర్స్ (-6.02%), డెన్ నెట్ వర్క్స్ (-5.77%)