kakinada: కాకినాడను అవినీతిలో స్మార్ట్ గా చేశారు: వైఎస్ జగన్ ధ్వజం

  • కాకినాడలో అంతులేని అవినీతి జరుగుతోంది
  • ఇక్కడి అభివృద్ధి గురించి పాలకులు పట్టించుకోవట్లేదు
  • ప్రజలు కంపులో ఉండటం స్మార్ట్ సిటీనా?

రాష్ట్రాన్ని గజదొంగలు పరిపాలిస్తే ఎలా ఉంటుందనడానికి నిదర్శనం కాకినాడ అని వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, కాకినాడను స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి బదులు, అవినీతిలో స్మార్ట్ గా తయారు చేశారని, ఇక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని, ఆయిల్ మాఫియా, డీజిల్ మాఫియాలు ఉన్నాయని, ఇక్కడ పుష్కలంగా పేకాట క్లబ్ లు ఉన్నాయని అన్నారు.

 నాలుగేళ్ల పాలనలో ఇక్కడి అభివృద్ధి గురించి పట్టించుకోని పాలకులు, ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో అభివృద్ధి చేస్తామంటూ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని విమర్శించారు. ‘ఐదేళ్లలో కాకినాడకు స్మార్ట్ సిటీ కింద కేంద్రం వెయ్యి కోట్లు ఇవ్వాలి. కేంద్రం 400 కోట్లు ఇస్తే, బాబు 50 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ప్రజలు కంపులో ఉండటం స్మార్ట్ సిటీనా?’ అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News