paruchuri gopalakrishna: ఒక దర్శకుడిగా సినారేతో పాటలు రాయించడం అద్భుతమైన అనుభూతి: పరుచూరి గోపాలకృష్ణ
- దర్శకుడిగా 'సర్పయాగం' చేశాను
- అన్ని పాటలను గురువుగారితో రాయించాను
- అప్పుడాయన అలా అనేవారు
కథా రచయితగా .. సంభాషణల రచయితగానే కాదు దర్శకుడిగాను పరుచూరి గోపాలకృష్ణ శభాష్ అనిపించుకున్నారు. తాజాగా ఆయన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను దర్శకత్వం వహించిన 'సర్పయాగం' సినిమాను గురించి ప్రస్తావించారు.
"ఒక దర్శకుడిగా 'సర్పయాగం' సినిమాకి అన్ని పాటలను మా గురువుగారితో రాయించుకున్నాను. పాటలు రాసే సందర్భంలో .. 'ఇక్కడ నేను గురువును .. నువ్వు శిష్యుడివి కాదు, నువ్వు డైరెక్టర్ వి .. నేను రైటర్ ను .. నీకేం కావాలో నన్ను అడగాలి' అనేవారు. నిజం చెప్పాలంటే 'సర్పయాగం' సినిమా కథాబలంతో సగం ఆడితే, మాస్టారి పాటల బలంతో సగం ఆడింది. అద్భుతమైన పాటలను మాష్టారు నాకు రాసిచ్చారు.
ఆ తరువాత నేను 'పెద్దన్నయ్య' సినిమాకి పాట రాయించడం కోసం గురువుగారి దగ్గరికి వెళ్లాను. ఈ సినిమాకి కథ .. మాటలు మేమే రాశాము. 'ఈ పాట కోసం నా దగ్గరికే ఎందుకు వచ్చావో నాకు తెలుసు గోపాలకృష్ణ' అంటూ నవ్వుతూ, 'కుటుంబం .. అన్నగారి కుటుంబం .. ' అనే అద్భుతమైన పాటను ఆయన రాసిచ్చారు' అని చెప్పుకొచ్చారు.