sensex: అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- అప్రమత్తంగా వ్యవహరించిన ఇన్వెస్టర్లు
- 22 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 10,971 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఆద్యంతం లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడాయి. ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు 100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్... ఆ తర్వాత ఆటుపోట్లకు గురైంది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 22 పాయింట్లు కోల్పోయి 36,351కి పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 10,971 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ ఎంటర్ ప్రైజెస్ (8.63%), అదానీ పవర్ (8.54%), బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.63%), రాడికో ఖైతాన్ లిమిటెడ్ (4.58%), డీబీ కార్ప్ (4.41%).
టాప్ లూజర్స్:
శ్రీ రేణుకా షుగర్స్ (-10.05%), పీసీ జువెలర్స్ (-8.72%), మైండ్ ట్రీ (-7.96%), ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (-7.08%), జైన్ ఇరిగేషన్ (-6.03%).