loan waiver: రుణమాఫీని రాజకీయ ఆయుధంగా మార్చేశారు: ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్

  • రుణమాఫీతో ఆర్థిక సంస్థలకు నష్టం
  • మాఫీని పరిపాలన అంశంగా మార్చేశారు
  • రుణమాఫీలో క్రమ శిక్షణ అవసరం

రాష్ట్రం ఏదైనా, పార్టీ ఏదైనా మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ వచ్చి చేరిపోతోంది. రైతుల పక్షాన నిలవడం ద్వారా గద్దెనెక్కవచ్చన్న వ్యూహంతో పార్టీలన్నీ రుణమాఫీని అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి. తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీ మీదేనంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. రైతు రుణమాఫీ పార్టీ ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రంగా మారడంపై భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ స్పందించారు.

ప్రతీసారి రుణమాఫీని అమలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రుణమాఫీ వల్ల ఆర్థిక సంస్థలు కోలుకోలేని విధంగా నష్టపోతాయని పేర్కొన్నారు. రైతు రుణమాఫీని పరిపాలనా సంబంధమైన అంశంగా మార్చివేయడం తగదని సూచించారు. ఈ విషయంలో క్షమశిక్షణ అవసరమని పేర్కొన్న గాంధీ, రుణమాఫీ  ఏదైనా.. దానివల్ల సంస్థలకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News