Rahul Gandhi: నేడు సభలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు? 'భూకంపం' వస్తుందా?.. సర్వత్ర ఆసక్తి!
- రాహుల్ 'భూకంపం'పై మరోమారు చర్చ
- గతంలో 15 నిమిషాలు కోరిన రాహుల్
- ఇప్పుడు కావాల్సినంత సమయం
2016లో ఓసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, పార్లమెంట్లో తనకు మాట్లాడే అవకాశం ఇస్తే కనుక భూకంపం పుడుతుందని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఏప్రిల్లో మరోసారి మాట్లాడుతూ.. పార్లమెంటులో తనకు మాట్లాడేందుకు 15 నిమిషాల సమయం ఇస్తే మోదీ ఇక నిలబడలేరని పేర్కొన్నారు.
ఈ రోజు ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగెస్ సభ్యులను ముందుండి నడిపించనున్నారు. చర్చ సందర్భంగా కాంగ్రెస్కు 38 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం చిక్కింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మాట్లాడనున్నారు. అవకాశం దొరికింది కాబట్టి రాహుల్ ఇప్పుడు సృష్టించబోయే భూకంపం గురించి అందరూ ఎదురుచూస్తున్నారు. మరి సృష్టిస్తారా? చూస్తూ ఉండండి.. పార్లమెంట్ లైవ్!