Congress: గల్లా గారూ... శాపం తగిలింది తెలుగుదేశం పార్టీకే: రాకేష్ సింగ్
- కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందన్న గల్లా
- కాంగ్రెస్ పక్కన కూర్చోగానే టీడీపీకి శాపం తగిలింది
- కాంగ్రెస్ తో కలసిన కుమారస్వామి కన్నీరు పెట్టుకున్నారు
- బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్
ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన బీజేపీకి కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని, ఆ పార్టీ శాపానికి గురి కానుందని అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తూ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. "గల్లా గారూ... మీరు బీజేపీకి శాపం తగులుతుందని వ్యాఖ్యానించారు.
కానీ, ఎప్పుడైతే మీరు కాంగ్రెస్ పక్కన కూర్చున్నారో, అప్పుడే మీకు శాపం తగిలినట్టే. ప్రజలు వెలేసేది బీజేపీని కాదు. టీడీపీనేనని తొందర్లోనే తెలుస్తుంది" అని అనడంతో బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేయగా, తెలుగుదేశం సభ్యులు సభలో నిరసన తెలిపారు. ఆపై తన ప్రసంగాన్ని కొనసాగించిన రాకేష్, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కర్ణాటకలో ప్రభుత్వాన్ని ప్రారంభించిన కుమారస్వామి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని దేశమంతా చూశారని అన్నారు.