maruthi: వీలైతే బన్నీతో .. లేదంటే శిరీష్ తో మారుతి!

  • అల్లు అర్జున్ తో మంచి సాన్నిహిత్యం 
  • ఆయనతో సినిమా చేయాలనే ఆశ 
  • ఆలస్యమైతే శిరీష్ ఉండనే వున్నాడు
యూత్ పల్స్ పట్టుకోవడంలో మారుతి సిద్ధహస్తుడు .. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడమెలాగో ఆయనకి బాగా తెలుసు. అలాంటి మారుతి ప్రస్తుతం 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమా విడుదల కాగానే ఆ తరువాత సినిమాను ఆయన గీతా ఆర్ట్స్ లో చేయనున్నాడు.

గతంలో ఆయన గీతా ఆర్ట్స్ లో 'భలే భలే మగాడివోయ్' చేసిన సంగతి తెలిసిందే. మారుతికి .. అల్లు అర్జున్ కి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన అల్లు అర్జున్ తో చేయాలనే ఆశతో మారుతి వున్నట్టుగా సమాచారం. మంచి కథను ఆయన రెడీ చేస్తే అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. విక్రమ్ కుమార్ .. త్రివిక్రమ్ సినిమాలు పూర్తయ్యాకే అల్లు అర్జున్ వేరే దర్శకుడితో సినిమా చేసే ఛాన్స్ వుంది. ఇది ఆలస్యమవుతుంది కనుక ఈలోగా మారుతి .. అల్లు శిరీష్ తో చేసే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.     
maruthi
Allu Arjun

More Telugu News