sensex: అవిశ్వాసంలో బీజేపీ నెగ్గుతుందనే ధీమాతో.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- అవిశ్వాసం నేపథ్యంలో ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు
- మధ్యాహ్నం నుంచి లాభాల బాటలోకి పయనం
- 145 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఈ ఉదయం మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకు ఒడిదొడుకుల్లో కొనసాగాయి. అవిశ్వాసంలో బీజేపీ నెగ్గుతుందనే ధీమాతో మధ్యాహ్నం నుంచి సూచీలు పుంజుకున్నాయి. దీనికి తోడు ఐటీ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 145 పాయింట్లు పెరిగి 36,496కు చేరుకుంది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 11,010 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పీసీ జువెలర్స్ (15.43), అదానీ పవర్ (10.79), స్టెరిలైట్ టెక్నాలజీస్ (9.66), బజాజ్ ఫైనాన్స్ (8.10), అదానీ ఎంటర్ ప్రైజెస్ (8.05).
టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (8.73), ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (7.50), టీటీఘర్ వ్యాగన్స్ (5.26), దిలీప్ బిల్డ్ కాన్ (4.99), ఇండియన్ బ్యాంక్ (4.91).