Toilet tea: టాయిలెట్ టీ ఎఫెక్ట్: కేటరర్లకు షాకిచ్చిన రైల్వే.. పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు రద్దు!

  • ‘టాయిలెట్ నీటితో టీ’ ఘటనపై స్పందన
  • 16 సంస్థల కాంట్రాక్టు రద్దు
  • రూ.4.87 కోట్ల జరిమానా

ప్రయాణికులకు సరఫరా చేస్తున్న ఆహారంలో నాణ్యత ఉండడం లేదన్న కారణంతో 16 కేటరర్ల కాంట్రాక్ట్‌ను రైల్వే రద్దు చేసింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ సహాయమంత్రి రాజన్ గోహైన్ రాజ్యసభకు తెలిపారు. రైలు టాయిలెట్‌లోని నీళ్లను నింపుకుని బయటకు వస్తున్న ఓ చాయ్‌వాలా వీడియో ఇటీవల వైరల్ అయింది.

చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన ఈ ఘటనతో రైళ్లలో టీ తాగాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. ఈ ఘటనను ప్రస్తావించిన మంత్రి.. గత ఆర్థిక సంవత్సరంలో 16 సంస్థల కాంట్రాక్టులను రద్దు చేసినట్టు తెలిపారు. పానీయాల తయారీకి టాయిలెట్ నీళ్లు ఉపయోగిస్తున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. టాయిలెట్ నీళ్ల ఘటనలో ఆ కేటరర్‌పై కఠిన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. గతేడాది 16 సంస్థల కాంట్రాక్టులను రద్దు చేసినట్టు మంత్రి తెలిపారు. అలాగే సేవలు, ఆహారంలో నాణ్యత లేకపోవడం తదితర కారణాలతో రూ.4.87 కోట్ల జరిమానా విధించినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News