Cyberattack: సింగపూర్‌పై అతిపెద్ద సైబర్ దాడి.. ప్రధాని సహా 1.5 మిలియన్ల మంది డేటాబేస్ చోరీ!
- ప్రజల హెల్త్ డేటా బేస్ చోరీ
- ధ్రువీకరించిన ప్రభుత్వం
- సాధారణ హ్యాకర్ల పని కాదని అనుమానం
సింగపూర్‌పై అతిపెద్ద సైబర్ దాడి జరిగింది. ప్రధాని లీ హెచ్సీన్ లూంగ్ సహా ప్రభుత్వం వద్ద ఉన్న 1.5 మిలియన్ల మంది హెల్త్ డేటా బేస్ చోరీకి గురైంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొంది. సైబర్ సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టమైన భద్రత కలిగిన దేశంపై దాడి జరగడం ఆందోళనకు గురిచేస్తోంది.
డేటా చోరీపై సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. ఓ ప్రణాళిక ప్రకారం డేటాను తస్కరించారని ప్రభుత్వం తెలిపింది. ఇది సాధారణ హ్యాకర్ల పనో, క్రిమినల్ గ్యాంగ్ పనో కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 2015 నుంచి ఈ ఏడాది జూలై వరకు ఆసుపత్రులను సందర్శించిన 1.5 మిలియన్ల మందికి చెందిన డేటాను హ్యాకర్లు చోరీ చేశారు.