ASUS ZENFONE MAX PRO M1: 'రెడ్ మీ నోట్ 5 ప్రో'కి పోటీగా ఆసుస్ నుండి కొత్త స్మార్ట్ఫోన్ విడుదల!
- 'జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1'ని విడుదల చేసిన ఆసుస్
- ఈనెల 26 నుంచి అందుబాటులోకి
- షియోమీ రెడ్మీ నోట్ 5, నోట్ 5 ప్రో లకి గట్టి పోటీ
తైవాన్ మొబైల్ దిగ్గజం ఆసుస్ తన నూతన స్మార్ట్ఫోన్ 'జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1'ని తాజాగా విడుదల చేసింది. షియోమీ సంస్థ ప్రవేశపెట్టిన రెడ్మీ నోట్ 5, నోట్ 5 ప్రో లకు జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 గట్టి పోటీ ఇవ్వనున్నట్లు ఆసుస్ సంస్థ పేర్కొంది. ఈనెల 26 నుంచి వినియోగదారులకు ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ 3జీబీ, 4జీబీతో పాటు 6జీబీ ర్యామ్ వేరియెంట్లలో కూడా లభిస్తుంది. భారీ బ్యాటరీ బ్యాకప్ గల ఈ ఫోన్ ధరలు వరుసగా రూ.10,999 (3జీబీ ర్యామ్), రూ.12,999 (4జీబీ ర్యామ్), రూ.14,999గా (6జీబీ ర్యామ్)గా ఉన్నట్లు ఆసుస్ సంస్థ పేర్కొంది.
జెన్ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 ప్రత్యేకతలు:
- 5.99" ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ (ఫాస్ట్ ఛార్జింగ్)
- 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
- క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్
- 16/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు(ఎల్ఈడీ ఫ్లాష్), 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా(ఎల్ఈడీ ఫ్లాష్)
- 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమోరీ కార్డు ద్వారా 2టీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు)