samajvadi party: ‘తలాక్’ ను సమర్థిస్తూ సమాజ్ వాదీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

  • ముమ్మారు తలాక్ సమర్థనీయమేనన్న నేత 
  • భార్యను చంపడం కంటే ట్రిపుల్ తలాక్ మంచిది
  • ముస్లిం మహిళలకు 8 శాతం రిజర్వేషన్ కల్పించాలి

సమాజ్ వాదీ పార్టీ నేత రియాజ్ అహ్మద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘తలాక్’ సమర్థనీయమేనని, భార్యను చంపడం కంటే ట్రిపుల్ తలాక్ చెప్పడమే మంచిదంటూ ఓ ఉదాహరణ చెప్పారు. ‘ఉదాహరణకు మీ భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఆమెను చంపడమో లేక ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకోవడమో చేయాలి’ అని వ్యాఖ్యానించారు. ముస్లిం మహిళలకు బీజేపీ ఏదైనా మంచి చేయాలనుకుంటే వారికి 8 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News