cm ramesh: బీజేపీ భయపడుతోంది.. అందుకే స్వల్పకాలిక చర్చ: సీఎం రమేష్
- రూల్ 168 కింద చర్చ చేపడితే, ఓటింగ్ జరుగుతుందనేది బీజేపీ భయం
- స్వల్పకాలిక చర్చలో కేంద్ర ప్రభుత్వ అన్యాయాన్ని ఎండగడతాం
- ఇతర పార్టీల మద్దతుతో రాష్ట్ర సమస్యలను దేశం దృష్టికి తీసుకెళతాం
ఏపీ విభజన హామీలపై రాజ్యసభలో ఈరోజు జరగనున్న స్వల్పకాలిక చర్చలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. రూల్ 168 కింద చర్చ చేపడితే, ఓటింగ్ జరుగుతుందని బీజేపీ భయపడుతోందని... అందుకే ఈ అంశంపై స్వల్పకాలిక చర్చకు అంగీకరించిందని ఎద్దేవా చేశారు. లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా విభజన చట్టం అమలుపై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లు మాట్లాడకపోవడాన్ని ఈ రోజు రాజ్యసభలో లేవదీస్తామని చెప్పారు. ఇతర పార్టీల మద్దతుతో ఏపీ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళతామని అన్నారు.