polavaram: ‘పోలవరం’ మోదీ వరం: రాజ్యసభలో జీవీఎల్

  • కేంద్ర పథకాలను ఏపీ తమవిగా చెప్పుకుంటోంది
  • మోదీ నిధులు ‘చంద్రన్న బీమా’గా ప్రచారం
  • కేంద్రం ప్రజల పక్షాన ఉంది
  • ఏపీ కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తోంది

‘పోలవరం’ మోదీ వరం అని, ఈ ప్రాజెక్ట్ కు కేంద్రం ఇప్పటి వరకు రూ.6,700 కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి సాగరమాల ప్రాజెక్టు కింద 14 పథకాలు మంజూరు చేశామని, ఈ పనుల విలువ రూ.1,63,537 కోట్లని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రానికి మంజూరు కాని విధంగా ఏపీకి 7.42 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని, కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని, మోదీ నిధులను ‘చంద్రన్న బీమా’ గా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రజల పక్షాన ఉంటే, రాష్ట్రం కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తోందని మండిపడ్డారు.

ప్రత్యేకహోదాకి, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఏపీకి ఐదేళ్ల కాలంలో పన్నుల వాటా కింద రూ.2,44,272 కోట్ల నిధులు మంజూరు చేసిందని, రెవెన్యూ లోటు కింద రూ.22,133 కోట్లు కేటాయించిందని అన్నారు. ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ కేవలం ఐదేళ్లు మాత్రమే ఉందని, రూ.లక్షా 27 వేల కోట్లు అదనంగా వస్తున్నప్పుడు అన్యాయం జరిగిందని ఏపీ ప్రభుత్వం ఎలా అంటుందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడిపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఒకటి కాదు, పలు యూటర్న్ లు తీసుకున్నారని అన్నారు.  

  • Loading...

More Telugu News