piysuh goel: ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: పీయూష్ గోయల్
- హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పింది
- ఏపీకి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం
- విజయనగరంలో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరోసారి స్పష్టం చేశారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని, రెవెన్యూ లోటు కింద ఏపీకి ఐదేళ్లలో 22 వేల కోట్లు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని అన్నారు. ఏపీ ప్రభుత్వం పింఛన్ ను రూ.1000కు పెంచేసి కేంద్రాన్నిఇవ్వమంటే ఎలా అని ప్రశ్నించారు. ఏపీకి ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ, టీడీపీ మా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయినా ఏపీ అభివృద్ధి ఆగదని, కేంద్ర సాయంతో ఏపీలో జాతీయ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయని అన్నారు. విజయనగరంలో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.