greece: గ్రీస్‌లో పెను విషాదం.. వెంటాడుతున్న కార్చిచ్చు.. 74 మంది మృతి!
- గ్రీస్‌లో కొనసాగుతున్న దావానలం
- వేర్వేరు చోట్ల పలువురి మృతి
- శరవేగంగా విస్తరిస్తున్న మంటలు
గ్రీస్‌లో సోమవారం మొదలైన దావానలం విస్తరిస్తోంది. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 74 మందికిపైగా మృతి చెందారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేర్వేరు చోట్ల కార్చిచ్చు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. తీర ప్రాంత పట్టణమైన మాటీలో సముద్రం ఒడ్డున ఉన్న రిసార్టులో 26 మంది, ఏథెన్స్‌లో మరో 24 మంది కార్చిచ్చు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు రెడ్ క్రాస్ అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో మరో 24 మందికి పైగా మృతి చెందినట్టు పేర్కొన్నారు.
మంటలను అదుపు చేసేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2007లో సంభవించిన కార్చిచ్చులో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ దావానలం రేగడం ఇదే తొలిసారి. కార్చిచ్చుతో భయభ్రాంతులకు గురైన సమీప ప్రాంతాల ప్రజలు గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. కార్చిచ్చు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. గ్రీస్ ప్రధాని అలెక్సిస్ టిసిప్రాస్ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.