Rahul Gandhi: మోదీ కాబట్టి సరిపోయింది.. నన్ను హత్తు కోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి: రాహుల్ హగ్‌పై యోగి స్పందన
- రాహుల్ కింద శరద్ పవార్ పనిచేస్తారా?
- రాహుల్‌వి పిల్ల చేష్టలు
- అతడిలో హుందాతనం లేదు
లోక్‌సభలో ప్రధాని మోదీని ఆలింగనం చేసుకోవడం కాదని, దమ్ముంటే తనను ఆలింగనం చేసుకోవాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సవాలు విసిరారు. తనను హత్తుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని అన్నారు. రాహుల్ హగ్ ఓ పొలిటికల్ స్టంట్ అని కొట్టిపడేశారు. అతడివి పిల్ల చేష్టలని పేర్కొన్న యోగి, ఇటువంటి గిమ్మిక్కులను తాను అంగీకరించబోనన్నారు. రాహుల్ కు హుందాతనం, తెలివి తేటలులేవని, అందుకే ఇలా ప్రవర్తించారని విమర్శించారు.
ప్రతిపక్ష పార్టీలు తమ నేతగా ఎవరినీ ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించిన యోగి.. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను అఖిలేశ్ యాదవ్, మాయావతి అంగీకరిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. రాహుల్ నాయకత్వంలో శరద్ పవార్ పనిచేస్తారా? అని సూటిగా అడిగారు.