Bunny: ఫ్యామిలీ ఫొటోలు పోస్టు చేసిన బన్నీ... సూపరంటున్న ఫ్యాన్స్!
- భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హల ఫొటోలను పంచుకున్న అల్లు అర్జున్
- చాలా బాగున్నాయని కామెంట్లు
- ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న బన్నీ
తన భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హల ఫొటోలను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పంచుకోగా, అవిప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. స్నేహ, అయాన్, అర్హల ఫొటోతో పాటు అయాన్, స్నేహల సింగిల్ ఫొటోలను కూడా తన ఖాతాలో బన్నీ పోస్టు చేయగా, అవి నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఈ చిత్రాలు చాలా బాగున్నాయని, అందరూ క్యూట్ గా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవల వచ్చిన 'నా పేరు సూర్య' తరువాత, మరో చిత్రాన్ని అల్లు అర్జున్ ఇంకా ఒప్పుకోలేదన్న సంగతి తెలిసిందే. సినిమాకు, సినిమాకు మధ్య తీసుకున్న గ్యాప్ లో ఉన్న అల్లు అర్జున్, ప్రస్తుతం తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ, వారితో ఎంజాయ్ చేస్తున్నాడు.