Huawei Nova 3: పవర్ఫుల్ ప్రాసెసర్ లతో రెండు స్మార్ట్ఫోన్లని విడుదల చేసిన హువావే!
- నోవా 3, నోవా 3ఐ విడుదల
- ఈరోజు నుండే ప్రీ ఆర్డర్
- అమెజాన్లో విక్రయం
చైనా మొబైల్స్ తయారీ సంస్థ హువావే తన నోవా బ్రాండ్ పై నోవా 3, నోవా 3ఐ పేరిట రెండు స్మార్ట్ఫోన్ లని తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లకి ముందు భాగంలో రెండు కెమెరాలు, వెనుక భాగంలో రెండు కెమెరాలు ఏర్పాటు చేశారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల నోవా 3 ఫోన్ ధర రూ.34,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల నోవా 3ఐ ఫోన్ ధర రూ.20,990గా నిర్ణయించారు. ఈరోజు నుండే అమెజాన్లో ప్రీ ఆర్డర్ బుకింగ్ లు ప్రారంభం కాగా, ఆగస్టు 7నుండి నోవా 3ఐ, ఆగస్టు 23 నుండి నోవా 3 స్మార్ట్ఫోన్ లు విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి.
నోవా 3ఐ ఫీచర్లు:
- 6.3" ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- 1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ ప్రాసెసర్ కిరిన్ 710
- 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (256 జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు)
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
- డ్యుయల్ నానో సిమ్
- 16/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24/2 మెగాపిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు
- ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ
- 3340ఎంఏహెచ్ బ్యాటరీ
నోవా 3 ఫీచర్లు:
- 6.3" ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- 1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ ప్రాసెసర్ కిరిన్ 970
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
- 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (256 జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు)
- 16/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
- 24/2 మెగాపిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా
- 3750ఎంఏహెచ్ బ్యాటరీ