Asus ZenFone 5Z: 8జీబీ ర్యామ్ తో జెన్‌ఫోన్ 5జెడ్ స్మార్ట్‌ఫోన్ విడుదల!
- ఈనెల 30నుండి అందుబాటులోకి
- ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే విక్రయం
- యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 క్యాష్ బ్యాక్
తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ఆసుస్ నుండి జెన్‌ఫోన్ 5జెడ్ పేరిట నూతన స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.29999, 6జీబీ ర్యామ్,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ రూ.32999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ రూ.36999గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.
ఆమధ్య ఈ మూడు వేరియంట్ మోడల్ ఫోన్లను ఒకేసారి విడుదల చేసినప్పటికీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ లో సాంకేతిక లోపం కారణంగా 8జీబీ ర్యామ్ వేరియంట్ విక్రయానికి అందుబాటులోకి రాలేదు. తాజా అప్ డేట్ తో 8జీబీ ర్యామ్ వేరియంట్ తో పాటు 6జీబీ ర్యామ్ వేరియంట్లు కూడా ఈనెల 30 నుండి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉపయోగించి రూ. 2,000 వరకు క్యాష్ బ్యాక్ ని పొందొచ్చు.
జెన్‌ఫోన్ 5జెడ్ ప్రత్యేకతలు:
- 6.2" ఫుల్ హెచ్డీ డిస్ ప్లే
- 1080x2246 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
- 4జీబీ/ 6జీబీ/ 8జీబీ ర్యామ్
- 64జీబీ/ 128జీబీ/ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 12/8 మెగాపిక్సల్స్ డ్యూయెల్ బ్యాక్ కెమెరా (ఎల్ఈడీ ఫ్లాష్)
- 8 మెగాపిక్సల్స్ ఫ్రంట్ కెమెరా
- 3300ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఆపరేటింగ్ సిస్టం