Namaz: ఆజాన్ కోసం ఎందుకయ్యా మీకు లౌడ్ స్పీకర్లు?: ముస్లింలను ప్రశ్నించిన రాజ్ థాకరే
- నమాజు కావాలంటే ఇంట్లో చేసుకోండి
- ఎవరి కోసం మీ షో?
- ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఎన్ఎస్ చీఫ్
మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు నమాజును ఇంట్లోనే చేసుకోవాలని, రోడ్లపైకి ఎక్కడం మానుకోవాలని సూచించారు. అసలు ఆజాన్ కోసం వారికి లౌడ్ స్పీకర్లు ఎందుకని ప్రశ్నించారు. ‘‘నేను వారినెప్పుడూ ఒకటే అడుగుతున్నా. ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు ఎందుకు? నమాజు చేసుకోవాలనుకుంటే ఇంట్లో చేసుకోండి. ఎవరి కోసం మీ షో? రోడ్లపై పడి ఎందుకు చేస్తారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆజాన్ విషయంలో తొలుత బాలీవుడ్ సింగర్, నటుడు సోను నిగమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉదయాన్నే ఆజాన్ పేరుతో లౌడ్ స్పీకర్లతో చెవులను చిల్లులు పొడుస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఇది సరికాదని వ్యాఖ్యానించాడు. సోను వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన సోను నిగమ్.. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని, తన అభ్యంతరం లౌడ్ స్పీకర్లపైనేని స్పష్టం చేశాడు.