china rajappa: కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన చినరాజప్ప
- కాపులపై జగన్ ది సవతి తల్లి ప్రేమ
- మాకు రాజ్యాంగ పరిమితులు తెలుసు
- కాపు రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది
కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, అందుకే, ఆ అంశంపై తాను హామీ ఇవ్వలేనని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపుల పట్ల జగన్ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. తమకు రాజ్యాంగ పరిమితులు తెలుసు కనుకనే ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని అన్నారు. కాపు రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి వుందని, కాపులపై జగన్ కు సానుభూతి ఉంటే కేంద్రంపై పోరాడి ఇందుకు సంబంధించిన బిల్లును పాస్ చేయించాలని అన్నారు.