Tamilnadu: 2 వేల కేజీల పండ్లతో అమ్మవారి ఆలయాన్ని అలంకరించిన భక్తులు
- అమ్మాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
- 26 రకాల పండ్లతో ఆలయం మొత్తం అలంకరణ
- పూజా కార్యక్రమాల అనంతరం పేదలకు పంపిణీ
తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న మహాళీ అమ్మాన్ ఆలయం పండ్లతో నిండిపోయింది. దీంతో ఆలయం కొత్త కళను సంతరించుకుంది. ఆది పండుగలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా పూజలు నిర్వహించిన భక్తులు మహాళీ అమ్మాన్ ఆలయం అణువణువునూ పండ్లతో నింపేశారు. మామిడి, పైనాపిల్, పియర్స్, అరటి తదితర మొత్తం 26 రకాల 2 వేల కిలోల పండ్లను ఇందుకోసం ఉపయోగించారు. అమ్మవారి విగ్రహానికి పండ్లను దండగా కూర్చి అలంకరించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం పండ్లను భక్తులు, నగరంలోని పేదలకు పంచిపెట్టనున్నారు.