Assam: రికార్డు సృష్టించిన అస్సాం టీ.. కిలో రూ.39,001కి అమ్ముడుపోయిన వైనం!
- రికార్డులకెక్కిన అస్సాం టీ
- వేలంలో ‘గోల్డెన్ వెరైటీ’ టీకి అత్యధిక ధర
- మరో రకం టీకి రూ.19,363 ధర
అస్సాంలోని ఓ రకం టీ రికార్డు సృష్టించింది. గువాహటి టీ ఆక్షన్ సెంటర్ (జీటీఏసీ) నిర్వహించిన టీ వేలంలో కిలోకు ఏకంగా రూ.39,001 పలికింది. కిలో టీ పొడికి ఇంత ధర పలకడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. గువాహటికి చెందిన సురభ్ టీ ట్రేడర్స్ ఈ టీని కొనుగోలు చేసింది.
ఎగువ అస్సాంలోని దిబ్రూగఢ్‌కు చెందిన మనోహరి టీ ఎస్టేట్ ‘గోల్డెన్ వెరైటీ’ని పండిస్తోంది. ఇప్పుడు దీనికే వేలంలో రికార్డుస్థాయి ధర పలికింది. వేలంలో కురెసియాంగ్‌కు చెందిన మకైబరి టీ ఎస్టేట్ ఉత్పత్తి చేసే టీకి రూ.19,363 పలికింది. కాగా, 2002లో డా-హాంగ్ పావో టీ పొడి 20 గ్రాములు 28వేల డాలర్లకు అమ్ముడుపోయి రికార్డులకెక్కింది. ఇందులో ఔషధ గుణాలున్నాయని భావిస్తారు.