Jayadev Galla: మూడేళ్లయినా అంతర్జాతీయ విమాన సేవల్ని ప్రారంభించరా?: గల్లా జయదేవ్ మండిపాటు

  • విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టుల్ని అద్భుతంగా తీర్చిదిద్దాం
  • అయినా ఇంకా విమాన సేవలు మొదలు కాకపోవటం ఏంటి?
  • వెంటనే విమాన, కార్గో సేవల్ని ప్రారంభించాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, విజయవాడ ఎయిర్ పోర్టుల నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని నడపాలని గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ కేంద్రాన్ని కోరారు. ఈ రెండు విమానాశ్రయాలను మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దినప్పటికీ.. ఇంకా విమానాలను నడపకపోవడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్ సభలో ఈ రోజు జయదేవ్ మాట్లాడారు.


విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి అమెరికా, సింగపూర్, పశ్చిమాసియా దేశాలకు సర్వీసుల్ని నడుపుతామని గతంలో కేంద్రం ప్రకటించిన విషయాన్ని జయదేవ్ గుర్తుచేశారు. మూడేళ్ల క్రితమే వీటిని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇచ్చిన మాట మేరకు విజయవాడ, తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులతో పాటు విజయవాడ ఎయిర్ పోర్ట్ లో కార్గో సేవల్ని ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖను డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News