paruchuri gopalakrishna: గొప్పవాడిని కావాలనే ఉద్దేశంతోనే ఆ ఊరు నుంచి కదిలాను: పరుచూరి గోపాలకృష్ణ
- పత్తేపురంలో నాకు జీతంగా 750 వచ్చేది
- అంతకన్నా తక్కువ జీతమైనా ఉయ్యూరు వచ్చేశాను
- అందుకు కారణం అదే
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఘంటసాల గురించి ప్రస్తావించారు. "ఘంటసాలగారి మరణం .. నేను కూడా గొప్పవాడిని కావాలనే ఆలోచనను నాకు కలిగించింది. దాంతో నేను పత్తేపురం నుంచి ఉయ్యూరు వచ్చేశాను. పత్తేపురం అనే చిన్న విలేజ్ లో నాకు 750 రూపాయల జీతం వస్తుంటే .. 'ఉయ్యూరు' అనే పట్టణానికి 550 రూపాయల జీతానికే వచ్చాను.
'ఉయ్యూరు'కి రావడానికి కారణం ఏమిటంటే, పక్కనే విజయవాడ వుంది .. అక్కడికి వెళ్లి దూరదర్శన్ లోనో .. రేడియోలోనో .. పత్రికల్లోనో కథలు రాస్తూ నేను గొప్పవాడిని కావాలనే ఒక ఆలోచనతో అలా చేశాను. ఘంటసాల గారు చనిపోయినప్పుడు ఏడ్చేసిన మా కాలేజ్ పిల్లలు .. నేను ఆ ఊరు వదిలేసి వస్తున్నప్పుడు కూడా అలాగే ఏడ్చారు. ఇక 'ఉయ్యూరు' వచ్చిన తరువాతనే నేను ఆశించినట్టుగా నా జీవితం మలుపు తిరిగింది. ఆ మలుపు నన్ను సినిమా పరిశ్రమకి చేర్చింది" అంటూ ఆయన చెప్పుకొచ్చారు.