Tamilnadu: బ్లాక్ మెయిలింగ్.. అత్యాచారాలు.. 'సెక్స్ సైకో'ను కటకటాల్లోకి పంపిన పోలీసులు!
- సాంకేతికత సాయంతో అమ్మాయిల వ్యక్తిగత వివరాల చోరీ
- ఆపై బ్లాక్‌మెయిలింగ్, అత్యాచారం
- లొంగకపోతే అశ్లీల వెబ్సైట్లకు వీడియోల అమ్మకం
ఎంసీఏ చదివాడు. టెక్నాలజీపై మంచి పట్టుంది. కానీ, గతి తప్పాడు. నీచానికి పాల్పడి జైలు పాలయ్యాడు. సోదరిని సహా ఎవరినీ వదలని ఈ సెక్స్ సైకోను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా తామరైకుళం గ్రామానికి చెందిన దినేశ్ కుమార్ ఎంసీఏ చదువుకున్నాడు. అమ్మాయిలతో త్వరగా కలిసిపోయే గుణం ఉన్న దినేశ్ సాంకేతికత సాయంతో వారి వ్యక్తిగత ఫొటోలు, సంభాషణలు దొంగిలించి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో సొంత చెల్లిని కూడా వదలకపోవడం అతడిలోని క్రూర మనస్తత్వానికి అద్దం పడుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు దినేశ్ వెళ్లేవాడు. అక్కడికి వచ్చిన అమ్మాయిలతో చనువుగా ఉండేవాడు. అనంతరం ఓ ఫోన్ కాల్ చేసుకోవాలంటూ వారి నుంచి ఫోన్ తీసుకుని వారికి తెలియకుండా ‘ట్రాక్ వ్యూ’ అనే రహస్య యాప్‌ను ఇన్స్టాల్ చేసి ఏమీ ఎరగనట్టు తిరిగి వారికిచ్చేవాడు. ఆ యాప్‌ను తన ఫోన్లోని యాప్‌తో అనుసంధానం చేసేవాడు. ఫలితంగా అమ్మాయిల ఫోన్లోని వ్యక్తిగత సమాచారం దినేశ్ ఫోన్‌కు చేరిపోయేది. వ్యక్తిగత సంభాషణలు, అర్ధనగ్నఫొటోలు, వీడియోలు.. ఇలా అన్నీ అతడి ఫోన్లోకి వచ్చి చేరేవి. వీటిని ఆసరాగా చేసుకుని వారిని బెదిరించేవాడు. తన కోరిక తీర్చకుంటే వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించేవాడు. నిస్సహాయులుగా మారిన అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడేవాడు.
తాజాగా ఓ యువతికి ఫోన్ చేసి ఇలానే బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తెలియని ఆమె తన సమస్యను సోదరికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి ఇద్దరూ కలిసి ఓ ప్లాన్ వేశారు. ఆ ప్రకారం, దినేశ్‌ను ఓ చోటికి రావాలని కోరింది. దినేశ్ అక్కడికి రావడానికి ముందే బాధితురాలు, ఆమె సోదరి, బంధువులు చేరుకున్నారు. అనంతరం తీరిగ్గా వచ్చిన దినేశ్‌ను చూసి వారు ఆశ్చర్యపోయారు. బాధితురాలికి అతడు వరుసకు తమ్ముడు అవుతాడు. దీంతో విస్తుపోయిన బంధువులు అతడిని పట్టుకుని చావబాది పోలీసులకు అప్పగించారు.
దినేశ్ వద్ద మొత్తం 80 మంది యువతుల డేటా ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దినేశ్ డేటాలో తన సొంత చెల్లెలు వివరాలు కూడా ఉండడం పోలీసులనే ఆశ్చర్యపరిచింది. తన బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగిన వారిపై అత్యాచారానికి తెగబడే దినేశ్ తర్వాత వారి దుస్తులను దాచుకునే వాడు. అతడి బెదిరింపులకు లొంగని వారి వీడియోలను అశ్లీల వెబ్సైట్లకు అమ్మి సొమ్ము చేసుకునే వాడని పోలీసులు తెలిపారు. దినేశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.