Moto Z3: 5జీ నెట్ వర్క్ సపోర్ట్ తో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!
- షికాగోలో విడుదలైన మోటో జెడ్ 3
- 5జీ నెట్ వర్క్ సపోర్ట్ తో విడుదలైన తొలి స్మార్ట్‌ఫోన్
- ధర సుమారుగా రూ. 33,000గా ఉండే అవకాశం
లెనోవా అనుబంధ సంస్థ మోటోరోలా నుండి నూతన స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. షికాగోలో మోటో జెడ్ 3 పేరిట విడుదలైన ఈ ఫోన్ 5జీ నెట్ వర్క్ కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం కంపెనీ 5జీ మోటో మోడ్‌ని కూడా ప్రకటించింది. ప్రపంచంలోనే 5జీ నెట్ వర్క్ సపోర్ట్ తో విడుదలవుతోన్న తొలిఫోన్ ఇదే కావడం విశేషం.
వినియోగదారులకు పలు ఆకట్టుకునే ఫీచర్లతో పాటు దీనిలో అధునాతన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్ ప్రాసెసర్ ని అమర్చారు. ఈ ఫోన్ ధర ఇండియాలో సుమారుగా రూ.33,000గా ఉండే అవకాశం ఉంది. నలుపు రంగులో లభ్యం అయ్యే ఈ ఫోన్ అమెరికాలో ఈనెల 16 నుండి విక్రయానికి అందుబాటులోకి రానుంది. అనంతరం భారత మార్కెట్లోకి వస్తుంది.
మోటో జెడ్ 3 ప్రత్యేకతలు:
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్ ప్రాసెసర్
- 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే సౌకర్యం)
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ పీ, ఆండ్రాయిడ్ 9.0 కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం)
- 6" సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే
- 1080x2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- వెనక భాగంలో రెండు 12 /12 మెగాపిక్సల్ కెమెరాలు
- ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3000ఎంఏహెచ్ బ్యాటరీ (టర్బో పవర్ సపోర్ట్)