sonali: సోనాలిపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు: భర్త గోల్డీ బెల్
- ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది
- ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రీట్ మెంట్ తీసుకుంటోంది
- పాజిటివ్ గా తీసుకుని మేము ముందుకెళ్తున్నాం
హైగ్రేడ్ కేన్సర్ తో బాధపడుతున్న నటి సోనాలి బింద్రే త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, సన్నిహితులు ఎంతగానో కోరుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో పోస్ట్ లు చేస్తున్నారు. మరోపక్క, సోనాలి బింద్రే ఆరోగ్యం గురించి వారి కుటుంబసభ్యులు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో సోనాలి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో సోనాలి బింద్రే భర్త గోల్డీ బెల్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. సోనాలిపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రీట్ మెంట్ తీసుకుంటోందని చెప్పారు. ఇది సుదీర్ఘ ప్రయాణమని, దీన్ని పాజిటివ్ గా తీసుకుని తాము ముందుకెళ్తున్నామని తన ట్వీట్ లో గోల్డీ బెల్ చెప్పారు.