priyanka gandhi: రాజకీయ రణరంగంలోకి సోనియా తనయ.. తల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి ప్రియాంకా గాంధీ!

  • ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ వాద్రా
  • తల్లి స్థానాన్ని భర్తీ చేసేందుకు రెడీ?
  • ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థి ప్రకటన

గాంధీ కుటుంబం నుంచి రాజకీయ రణ క్షేత్రంలోకి దూకేందుకు మరో మహిళ సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సోనియా కుమార్తె, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ సిద్ధమవుతున్నారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనుండగా, ప్రియాక గాంధీ వాద్రా రాయబరేలీ నుంచి బరిలోకి దిగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి మాత్రం రాయబరేలీ నుంచి ఎవరు బరిలోకి దిగనున్నారన్న దానిపై అధికారిక ప్రకటన లేదు. అయితే, సోనియా స్థానాన్ని ప్రియాంక భర్తీ చేయడం ఖాయమని మాత్రం చెబుతున్నారు.

మరోవైపు, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, రానున్న ఎన్నికలను దృ‌ష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లో వ్యూహాత్మక పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు, శివసేనతో మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి ముందుకు వెళ్లరాదని కాంగ్రెస్ తీర్మానించుకున్నట్టు సమాచారం. రెండు పార్టీల సిద్ధాంతాలు వేర్వేరు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫలితాల తర్వాతే ప్రకటించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.  

  • Loading...

More Telugu News