yanamala: రాయితీలను, ప్రోత్సాహకాలను కేంద్రమే భరించాలి: యనమల
- సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలి
- టీటీడీని జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలి
- నేడు ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న యనమల
మధ్యతరగతి, చిన్న, మైక్రో పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను, ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల డిమాండ్ చేశారు. ఈరోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జీఎస్టీ 29వ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతానికి, సిమెంట్ పై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని అన్నారు. గిరిజన ఉత్పత్తులను, గిరిజన కార్పొరేషన్ ను, టీటీడీని జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ల విడి భాగాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరారు.