Chandrababu: తిరుపతిలో హోలీటెక్ పరిశ్రమ.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం!
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం
- రూ.1400 కోట్లు పెట్టుబడి పెట్టనున్న‘హోలీటెక్’
- తిరుపతిలో 75 ఎకరాల్లో ఏర్పాటు కానున్న పరిశ్రమ
హోలీ టెక్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. హోలీటెక్ కంపెనీ ఏపీలో రూ.1400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీ ద్వారా 6 వేల మందికి ఉద్యోగాల లభించనున్నాయి. తిరుపతిలో 75 ఎకరాల్లో ఈ కంపెనీ తమ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ ద్వారా ప్రతి నెలా 5 కోట్ల మొబైల్ విడిభాగాలు ఉత్పత్తి కానున్నాయి. మొదటి క్వార్టర్ లో ఉత్పత్తి ప్రారంభించాలన్నదే సంస్థ నిర్ణయం.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, దేశంతో తయారయ్యే మొబైల్ ఫోన్లలో 29 శాతం రాష్ట్రంలో తయారవుతున్నాయని, 240 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ వస్తువులు ఏపీ నుంచే ఉత్పత్తి కావాలన్నది లక్ష్యమని అన్నారు. ఏపీలో ఐదు రకాల వస్తువులను ఈ సంస్థ తయారు చేయనుందని అన్నారు. షామీ ప్రతినిధి మను జైన్ మాట్లాడుతూ, హోలీటెక్ ప్లాంట్ ఏర్పాటు చేసే విషయమై అనేక రాష్ట్రాలను సంప్రదించామని, ఏపీలో మాత్రమే నమ్మకమైన వాతావరణం ఏర్పడిందని అన్నారు. షామీ ఫోన్ల విడిభాగాలను హోలీ టెక్ సంస్థ తయారు చేస్తుందని చెప్పారు.