Asaduddin Owaisi: మిమ్మల్ని ముస్లింలుగా మార్చకపోతే అప్పుడడగండి.. యువకుడి గడ్డం కత్తిరించిన వారికి ఒవైసీ సవాల్!

  • ముస్లిం యువకుడి గడ్డాన్ని బలవంతంగా తొలగించిన నిందితులు
  • హరియాణాలోని గురుగ్రామ్‌లో ఘటన
  • నిందితులను హెచ్చరించిన ఒవైసీ
కొద్ది రోజుల క్రితం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ ముస్లిం యువకుడి గడ్డాన్ని కొందరు వ్యక్తులు బలవంతంగా గీయించారు. సంచలనంగా మారిన ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్లిం యువకుడి గడ్డాన్ని బలవంతంగా తొలగించడం హేయమన్న ఆయన, నిందితులను త్వరలోనే ముస్లింలుగా మార్చి వారితో గడ్డం పెంచేలా చేస్తానని సవాలు విసిరారు.

‘‘ముస్లిం యువకుడి గడ్డాన్ని తొలగిస్తారా? నేను వారి తల్లిదండ్రులకు చెబుతున్నా వినండి. మీరు మా కుత్తుకలు తెగ్గోసినా మేం ముస్లింలమే. మిమ్మల్ని త్వరలోనే ముస్లింలుగా మారుస్తాం. మీరు గడ్డాలతో తిరిగేలా చేస్తాం’’ అని హెచ్చరించారు.

ముస్లిం యువకుడు యూనస్ గడ్డాన్ని బలవంతంగా తొలగించిన  ఘటనలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 29లో ఈ ఘటన జరిగింది. యువకుడిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన ముగ్గురు నిందితులు అతడి గడ్డాన్ని షేవ్ చేయించారు.  
Asaduddin Owaisi
MIM
Muslim
beard

More Telugu News