Siddipet District: వ్యభిచారంలో నయా ట్రెండ్... సిద్ధిపేటలో వెలుగులోకి... తరిమికొట్టిన స్థానికులు!
- భార్యాభర్తలుగా కలసి వస్తున్న విటులు
- అమ్మాయితో కలిపి పంపుతున్న బ్రోకర్లు
- ఇద్దరు మహిళలను కొట్టి తరిమిన స్థానికులు
అది చూడటానికి మామూలు ఇల్లుగానే కనిపిస్తుంది. అక్కడ కాపురముండే వారింటికి చుట్టాలు, పక్కాలు, స్నేహితులు వస్తూ పోతూ ఉంటారు. పదే పదే కొత్త చుట్టాలు, స్నేహితులు రావడమే చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చేలా చేయగా, అసలు విషయం ఆరాతీసిన వారు అవాక్కయ్యారు. తమ ఇళ్ల మధ్య వ్యభిచారం చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తూ, వారిని తరిమికొట్టారు. సిద్ధిపేటలో ఈ ఘటన జరుగగా, ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ అవుతోంది. ఇటువంటి ఇళ్లు ఈ ప్రాంతంలో చాలానే ఉన్నాయన్నది ఇక్కడి వారి వాదన.
సిద్ధిపేటలో జరుగుతున్న వ్యభిచార దందాలో ఇదో నయా ట్రెండ్. ఇళ్లను అద్దెకు తీసుని వ్యభిచారదందా సాగిస్తున్న నిర్వాహకులు అమ్మాయిని, విటుడిని బయటే కలిసేలా చూసి, భార్యాభర్తలుగా, చుట్టాలుగా కలరిచ్చి, ఇంట్లోకి పంపుతున్నారు. కొందరు పెద్దమనుషులు బ్రోకర్లుగా మారి ఈ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అధికంగా అద్దెలు చెల్లించి, కొన్ని ఇళ్లను తీసుకున్న బ్రోకర్లు, అక్కడ ఓ కుటుంబాన్ని ఉంచి, ఆపై తమ దందాలను సాగిస్తున్నారు. ఆ ఇంట్లోని వారు భార్యా భర్తలుగా జీవిస్తూ, ఇంటికి వచ్చి వెళ్లే వారికి కాపలాగా ఉంటారు. అక్కడికి వెళితే, అత్యంత సురక్షితమని విటులకు చెప్పి, వారిని పంపుతున్నారు.
సిద్ధిపేటలోని పలు కాలనీల్లో ఈ కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు అంది, వారు వెళ్లగా, అక్కడ భార్యాభర్తలే కనిపిస్తున్నారు తప్ప, వచ్చే జంటలు పట్టుబడటం లేదు. ఈ దందాలు సాగుతున్న విధానంపై వీడియోలు తీసి మరీ వైరల్ చేస్తున్నారు. పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.