Rajya Sabha: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తాం: విజయసాయిరెడ్డి
- బీజేపీకి, దాని మిత్ర పక్షాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తాం
- ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలను నెరవేర్చకపోవడమే కారణం
- హోదాను ఇవ్వలేమంటూ కేంద్రం స్పష్టం చేసింది
ఈ నెల 9న జరగనున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడం, విభజన హామీలను నెరవేర్చకపోవడం వల్ల తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వలేమంటూ పార్లమెంటులో కూడా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని తెలిపారు. గత నాలుగున్నరేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతోందని... హోదాను ఇవ్వలేమంటూ కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, ఆ పార్టీకి వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామని చెప్పారు.