sensex: యూఎస్-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు!
- అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు
- 26 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 2 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసిన నిఫ్టీ
అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 26 పాయింట్లు కోల్పోయి 37,665కి పడింది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 11,389 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వక్రాంగీ (18.44%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (14.95%), ఎన్ఎండీసీ (6.24%), ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా (5.43%), ఇన్ఫో ఎడ్జ్ ఇండియా (5.03%).
టాప్ లూజర్స్:
అవంతీ ఫీడ్స్ (-11.81%), అదానీ పవర్ (-9.70%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (-8.10%), నవభారత్ వెంచర్స్ (-6.49%), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (-6.49%).