cinema: బయటి ఆహారాన్ని అనుమతిస్తే భద్రతా పరమైన సమస్యలా, ఎలాగో చెప్పండి?: ‘మహా’ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్న ప్రభుత్వం
- తలదూరిస్తే భద్రతాపరమైన సమస్యలు వస్తాయంటూ కోర్టుకు తెలిపిన వైనం
- ఎటువంటి సమస్యలు వస్తాయో చెప్పాలన్న ధర్మాసనం
మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలోకి బయటి ఆహారాన్ని అనుమతిస్తే భద్రతాపరమైన సమస్యలు వస్తాయన్న ప్రభుత్వ పిటిషన్‌పై బాంబే హైకోర్టు స్పందించింది. ఎటువంటి సమస్యలు వస్తాయో చెప్పాలని నిలదీసింది. బయటి ఆహారాన్ని తెచ్చుకోవద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. విమానాల్లోనే బయటి ఫుడ్‌ను అనుమతిస్తున్నప్పుడు థియేటర్లలోకి ఎందుకు అనుమతించరని జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ అనూజా ప్రభుదేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఈ వివాదంలో తాము తలదూర్చలేమని, తాము జోక్యం చేసుకుంటే గందరగోళం ఏర్పడుతుందని, భద్రతాపరమైన సమస్యలు వస్తాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో స్పందించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సినిమా హాళ్లలోకి బయటి ఆహారాన్ని తెచ్చుకోవద్దని చెప్పే ప్రత్యేకమైన చట్టం ఏమీ లేదని పేర్కొన్న కోర్టు, ప్రేక్షకులను ఆహారం తెచ్చుకోకుండా అడ్డుకోలేరని తేల్చి చెప్పింది.