Hyderabad: పిల్లలు బాత్ రూములో... భర్త మృతదేహం పక్కనే ప్రియుడితో రాసలీలలు!

  • ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన దేవిక
  • ఆపై మద్యం తాగి రాసలీలలు
  • చేతికి గాయాలు చేసుకుని భర్త హింసిస్తున్నాడని కట్టుకథ
  • పిల్లలను విచారించిన తరువాత అసలు నిజం బట్టబయలు

హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో కలకలం రేపిన ఓ హత్య కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. తన ప్రియుడి కోసం భర్తను దారుణంగా హత్య చేసిందా ఇల్లాలు. వారి పిల్లలు చెప్పిన వివరాలతో కేసును విచారించిన పోలీసులు, 24 గంటల్లోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఆపై ప్రియుడిని, ఆమెను కటకటాల వెనక్కు నెట్టారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇక్కడి బర్త్ ప్లేస్ ఆసుపత్రిలో దంపతులు బానోతు జగన్ (35), దేవిక (30) పని చేస్తూ ఓ ఇంట్లో అద్దెకు ఉంటుండగా, వారికి ఎనిమిదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు.

 కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన తోట బెనర్జి (32) ఫిలింనగర్‌ లోని ఓ బీపీఓలో లైజన్‌ ఆఫీసర్‌ గా పని చేస్తూ దేవికతో పరిచయం పెంచుకుని ఆమెతో వివాహేతర బంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆమెను వదిలి ఉండలేని అతను, ఏడాది క్రితం దేవిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, ఆమెను పెళ్లాడతానని చెప్పగా, వారు ఆగ్రహంతో బెనర్జీ పనిచేసే కంపెనీ దగ్గరకు వచ్చి మరీ దేహశుద్ధి చేశారు. ఆ తరువాత కూడా బెనర్జీ, దేవిక కలుస్తుండేవారు. విషయం తెలిసిన జగన్, పలుమార్లు భార్యను వారించినా, ఎప్పటికప్పుడు ఆయన కళ్లుగప్పి జగన్ వద్దకు వెళుతుండేది దేవిక.

ఈ క్రమంలో జగన్ ను హత్య చేయాలని దేవిక, బెనర్జీ ప్లాన్ చేశారు. జగన్ దంపతులు అద్దెకున్న ఇంటి పెంట్ హౌస్ లోకి రెంట్ కు దిగాడు బెనర్జీ. సోమవారం అర్థరాత్రి 1.30 గంటల సమయంలో జగన్ నిద్రిస్తున్న వేళ, అతని మర్మాంగాలను దేవిక గట్టిగా పిసికేస్తుండగా, అతని ఛాతీపై కూర్చున్న బెనర్జీ, గొంతును నులిమి హత్య చేశాడు. దాదాపు అరగంట పాటు ఈ హత్యాకాండ సాగగా, మధ్యలో పిల్లలు నిద్రలేవడంతో వారిని బాత్ రూములో వేసిన దేవిక, బయట గడియపెట్టింది. జగన్ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత, పూటుగా మద్యం తాగిన ఇద్దరూ రాసలీలలు ఆడారు. ఆపై గంట సేపటి తరువాత బెనర్జీ వెళ్లిపోగా, తన సోదరుడికి ఫోన్ చేసిన దేవిక, బావ చనిపోయాడని చెబుతూ, చేతులకు గాయాలు చేసుకుంది.

తన భర్తను తానే చంపానని, తనను హింసిస్తుంటే తట్టుకోలేకపోయానని దేవిక పోలీసులకు చెప్పింది. అయితే, పిల్లలు మాత్రం మరో అంకుల్ వచ్చాడని చెప్పగా పోలీసులు ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. అప్పుడే ఆరు నెలల క్రితం బెనర్జీతో జరిగిన గొడవ, బెనర్జీ ఉంటున్నది హత్య జరిగిన ఇంటి పై పోర్షన్ లోనేనని తేలింది. ఆపై బెనర్జీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో హత్య వెనుక అతని ప్రమేయం ఉందన్న నిర్దారణకు వచ్చి పోలీసులు, సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా అతనిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News